Posts

Showing posts from June, 2018

అత్యంత పారితోషికం అందుకునే ఆట‌గాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి

Image
ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకునే ఆటగాళ్ల జాబితాలో ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చోటు దక్కించుకున్నారు. 2.4 కోట్ల డాలర్లు (రూ.158 కోట్లు సుమారు) పారితోషికంతో కోహ్లి  83వ స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్‌ పత్రిక రూపొందించిన ‘వరల్డ్స్ హయ్యస్ట్ పెయిడ్ అథ్లెట్స్ 2018’ జాబితాలో భారత్‌ నుంచి విరాట్‌ కోహ్లి ఒక్కడికే చోటు లభించింది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన బాక్సింగ్ ఛాంపియన్ ఫ్లాయిడ్‌ మేవెదర్ అగ్రస్థానంలో ఉండ‌గా, ఫోర్బ్స్‌ ఈ జాబితాలో ఒక్క మహిళా అథ్లెట్ కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం కోహ్లికి ఉన్న పాపులారిటీ మరెవరికీ లేదని, సోషల్‌ మీడియా ఫాలోవర్సే దీన్ని ప్రతిబింబిస్తున్నారని ఫోర్బ్స్‌ పేర్కొంది.  ఒక్క భారత్‌లోనే కాకుండా కోహ్లీ ప్రపంచ వ్యాప్తంగానూ ప్రాచుర్యం పొందిన ఆటగాడిగా ఫోర్బ్స్ అభివర్ణించింది. ట్విట్టర్లో ఇప్పటికే ఈయనికి 2.5 కోట్ల మందికి పైగా ఫాలోవర్స్‌  ఉన్నట్టు వివరించింది. ఫోర్బ్స్‌ రూపొందించిన ఈ జాబితాలో ప్రపంచ నెంబర్‌ 1గా నిలిచిన మేవేదర్‌ పారితోషికం 28.5 కోట్ల డాలర్లు. అంటే  సుమారు రూ.1,881 కోట్లు. మేవెదర్‌ తర్వాతి రెండో స్థానంలో అర్జెంటీనా ఫుట్ బాల

ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం

Image
హైద‌రాబాద్‌లోని అబిడ్స్‌ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న నాలుగు అంతస్తుల ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ వస్త్ర దుకాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దుకాణంలోని వస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు అగ్నిమాపక శకటాలతో మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యుట్‌ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ముందు కింది అంతస్తులోని లిఫ్ట్‌‌ నుంచి పొగలు వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రాత్రి పది గంటలకు దుకాణం మూసివేసి సిబ్బంది వెళ్లిపోయాక ఈ ఘటన జరిగింది. మూసి వేసిన దుకాణంలో నుంచి పొగలు రావడం గమనించిన సెక్కురిటీ సిబ్బంది, స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది దుకాణం షెట్టర్లు తెరవడానికి ప్రయత్నించగా...కొద్ది సేపటి వరకు అవి తెరుచుకోలేదు. ఈ క్రమంలో మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు మిగతా మూడు అంతస్తులకు విస్తరించాయి. బట్టల దుకాణం కావడంతో ప్రమాదం తీవ్రత పెరిగి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.

సీఎం రమేష్ చేత దీక్షను విరమింపజేసిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు

Image
కడప ఉక్కు ప్లాంట్ కోసం ఆమరణ దీక్ష చేపట్టిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షను విరమింపజేశారు. నిమ్మరసం ఇచ్చి రమేష్, బీటెక్ రవిల దీక్షలను విరమింపజేశారు. అనంతరం ఇద్దరికీ శాలువా కప్పి అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ కోసం దీక్షను చేపట్టిన సీఎం రమేష్, బీటెక్ రవిలను అభినందించారు. మీరు చేపట్టిన దీక్ష యావత్ దేశం దృష్టిని ఆకర్షించిందని చెప్పారు. మీ దీక్షలు వృథాగా పోవని... కడప ఉక్కు ఫ్యాక్టరీ మీ వల్లే వచ్చిందనే విషయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం మన పోరాటం ఇంతటితో ఆగిపోలేదని... అందరం సంఘటితమై, ప్లాంట్ ను సాధించేంత వరకు పోరాటం కొనసాగిద్దామని చంద్ర‌బాబు పిలుపు నిచ్చారు.

ఈ కుర్రాడు చేసిన ప‌నికి గూగుల్ కితాబు

Image
బీహార్‌కు చెందిన 14 ఏళ్ల ఆర్యన్ ఆడుతూ, పాడుతూ మూడు యాప్‌లను రూపొందించాడు. రూపొందించిన యాప్‌ల‌ను గూగుల్‌కు పంపించాడు. దీనిపై గూగుల్ అధ్యయనం చేయడంతో పాటు ఆ కుర్రాడికి పురస్కారం కింద రూ. 2 లక్షలు అందజేసింది. గూగుల్ నిర్వహించిన అధ్యయనంలో ఆర్యన్ రూపొందించిన యాప్‌లు అద్భుతమని తేలింది. దీనికితోడు ఈ యాప్ డౌన్‌లోడ్‌ల సంఖ్య మరింతగా పెరుగుతోంది. కాగా ఈ యాప్‌లను రూపొందించిన ఆర్యన్... గూగుల్ అందించిన మొత్తాన్ని తీసుకునేందుకు నిరాకరించాడు. ఈ మొత్తాన్ని పేద పిల్లల చదువు కోసం ఖర్చు చేయాలని కోరాడు. 14 ఏళ్ల ఆర్యన్‌రాజ్ పాట్నాలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల వేసవి సెలవుల సందర్భంగా ఆర్యన్ మొబైల్ షార్ట్‌కట్, కంప్యూటర్ షార్ట్‌కట్, వాట్సాప్ క్లీనర్‌లైట్ అనే మూడు యాప్‌లను త‌యారు చేశాడు. వీటిని గూగుల్ ప్లే‌స్టోర్‌లో అప్‌లోడ్ చేసేందుకు పంపించాడు. దీంతో గూగుల్ ఈ మూడు యాప్‌లపైన అధ్యయనం చేసింది. వీటితో సత్ఫలితాలుంటాయని తేలింది. వీటిని గూగుల్ తన ప్లే‌స్టోర్‌లో అప్‌లోడ్ చేసింది. ఆర్యన్ రూపొందించిన యాప్‌లను ఒక్క నెలలోనే పదివేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. మొబైల్ షార్ట్ కట్ యాప్, కంప్యూటర్ షార్ట్‌కట్ యాప్‌లు

ఒప్పోతో జతకట్టిన జియో మ‌రో అదిరిపోయే బంపరాఫర్

Image
ప్ర‌స్తుతం రోజుకు వన్ జీబీ, టూ జీబీ డేటా ఆఫర్ రోజులు పోయాయి. ఒప్పోతో జతకట్టిన రిలయన్స్ జియో ఓ బంపరాఫర్ ను ప్రకటించింది. 'జియో - ఒప్పో మాన్ సూన్ ఆఫర్' పేరిట ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఈ ఆఫర్ కింద యూజర్లు 3.2 టెరాబైట్ల 4జీ డేటాను, రూ. 4,900 వరకూ ప్రయోజనాలను పొందవచ్చని సంస్థ తెలియ‌జేసింది. ఈ ఆఫర్ కోసం కొత్త ఒప్పో ఫోన్ ను కొనాల్సిన అవసరం లేదని, ఒప్పో ఫోన్ లో జియో సిమ్ ఉంటే చాలని తెలిపింది. జియో ప్రీపెయిడ్ ప్లాన్లతో తన ఫోన్ లో రూ. 198, రూ. 299తో రీచార్జ్ చేయించుకోవాలని పేర్కొంది. రీచార్జ్ చేయించుకుంటే రూ. 50 విలువైన 36 క్యాష్ బ్యాక్ ఓచర్లను (వీటి విలువ రూ. 1800) ఇస్తామని, 13వ , 26వ, 39వ రీరార్జ్ ల అనంతరం రూ. 600 చొప్పున మూడుసార్లు యూజర్ల జియో మనీ ఖాతాలో ఈ రూ. 1800ను జ‌మ‌ చేస్తామని తెలిపింది. దీంతోపాటు రూ. 1300 విలువైన మేక్ మై ట్రిప్ డిస్కౌంట్ కూపన్ కూడా అందిస్తామని, మై జియో యాప్ లో ఉన్న ఫోన్ పే ద్వారా రీచార్జ్ చేసుకుంటే రూ. 50 క్యాష్ బ్యాక్ వెంటనే లభిస్తుందని వెల్లడించింది.