ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం


హైద‌రాబాద్‌లోని అబిడ్స్‌ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న నాలుగు అంతస్తుల ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ వస్త్ర దుకాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దుకాణంలోని వస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు అగ్నిమాపక శకటాలతో మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యుట్‌ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

ముందు కింది అంతస్తులోని లిఫ్ట్‌‌ నుంచి పొగలు వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రాత్రి పది గంటలకు దుకాణం మూసివేసి సిబ్బంది వెళ్లిపోయాక ఈ ఘటన జరిగింది. మూసి వేసిన దుకాణంలో నుంచి పొగలు రావడం గమనించిన సెక్కురిటీ సిబ్బంది, స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది దుకాణం షెట్టర్లు తెరవడానికి ప్రయత్నించగా...కొద్ది సేపటి వరకు అవి తెరుచుకోలేదు. ఈ క్రమంలో మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు మిగతా మూడు అంతస్తులకు విస్తరించాయి. బట్టల దుకాణం కావడంతో ప్రమాదం తీవ్రత పెరిగి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.

మంటలను అదుపు చేయడం ఇబ్బందికరంగా మారడంతో అగ్నిమాపక శాఖ అధికారులు ప్రత్యేక వాహనాలను రప్పించారు. ఆస్తి నష్టం కోట్లలోనే ఉంటుందని దుకాణ యజమానులు తెలిపారు. దాదాపు మూడు గంటలపాటు శ్రమంచి మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకురావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మరో వైపు ప్రమాదానికి కారణంపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

Comments

Popular posts from this blog

About South India or about South Indian States or South Indian Cultural

About Dharmastalam