ఈ కుర్రాడు చేసిన పనికి గూగుల్ కితాబు
బీహార్‌కు చెందిన 14 ఏళ్ల ఆర్యన్ ఆడుతూ, పాడుతూ మూడు యాప్‌లను రూపొందించాడు. రూపొందించిన యాప్‌లను గూగుల్‌కు పంపించాడు. దీనిపై గూగుల్ అధ్యయనం చేయడంతో పాటు ఆ కుర్రాడికి పురస్కారం కింద రూ. 2 లక్షలు అందజేసింది. గూగుల్ నిర్వహించిన అధ్యయనంలో ఆర్యన్ రూపొందించిన యాప్‌లు అద్భుతమని తేలింది. దీనికితోడు ఈ యాప్ డౌన్‌లోడ్‌ల సంఖ్య మరింతగా పెరుగుతోంది. కాగా ఈ యాప్‌లను రూపొందించిన ఆర్యన్... గూగుల్ అందించిన మొత్తాన్ని తీసుకునేందుకు నిరాకరించాడు. ఈ మొత్తాన్ని పేద పిల్లల చదువు కోసం ఖర్చు చేయాలని కోరాడు. 14 ఏళ్ల ఆర్యన్‌రాజ్ పాట్నాలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల వేసవి సెలవుల సందర్భంగా ఆర్యన్ మొబైల్ షార్ట్‌కట్, కంప్యూటర్ షార్ట్‌కట్, వాట్సాప్ క్లీనర్‌లైట్ అనే మూడు యాప్‌లను తయారు చేశాడు. వీటిని గూగుల్ ప్లేస్టోర్‌లో అప్‌లోడ్ చేసేందుకు పంపించాడు. దీంతో గూగుల్ ఈ మూడు యాప్‌లపైన అధ్యయనం చేసింది. వీటితో సత్ఫలితాలుంటాయని తేలింది. వీటిని గూగుల్ తన ప్లేస్టోర్‌లో అప్‌లోడ్ చేసింది. ఆర్యన్ రూపొందించిన యాప్‌లను ఒక్క నెలలోనే పదివేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. మొబైల్ షార్ట్ కట్ యాప్, కంప్యూటర్ షార్ట్‌కట్ యాప్‌లు సిస్టంలోకి వైరస్ ప్రవేశాన్ని అడ్డుకుంటాయి. అలాగే వాట్సాప్ క్లీనర్‌లైట్ యాప్ అనేది వాట్సప్ బ్యాక్‌గ్రౌండ్ రంగును మార్చుకునేందుకు ఉపయోగపడుతుంది.
Comments
Post a Comment